సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు శాసన మండలి సభ్యులు గా ఎన్నికై 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేటి సోమవారం సాయంత్రం భీమవరం గునుపూడి లోని క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి YSRCP నాయకులు పట్టణ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చినమిల్లి వెంకట్రాయుడు , పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామ రాజు , మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్, కామన నాగేశ్వరరావు , మాజీ కౌన్సిలర్ కోడె యుగంధర్ , మాజీ సర్పంచ్ బోకూరి విజయ రాజు , సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బలే యేసు బాబు , చిగురుపాటి సందీప్ , బుంగ ప్రహ్లాదుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
