సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని, అన్ని దనాలకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. నేడు, సోమవారం భీమవరం శ్రీనివాస థియేటర్ సెంటర్ లోని త్రిలోకేశ్వర స్వామి ఆలయంలో 26వ ఆలయ వార్షిక శివరాత్రి వేడుకలు ముగింపులో భాగంగా నిర్వహించిన అన్న సమారాధనను వారిరువురు ప్రారంభించారు. అనంతరం శ్రీ భీమేశ్వర స్వామి స్వామివారిని ఆలయ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్ తో కలిసి దర్శించి పూజలు చేశారు. ముందుగా కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, నాగలక్ష్మి దంపతులచే పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మహా నివేదనను చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. అనంతరంసుమారు 4000 మంది భక్తులుస్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కూటమి నేతలు కోళ్ల నాగేశ్వరరావు, బండి రమేష్, మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, మైలబత్తుల ఐజాక్ బాబు, యలమంచిలి శ్రీను, విన్నకోట వినాయక్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. బివి రాజు వీరమ్మ పార్క్ సెంటర్ లోని శ్రీభోగలింగేశ్వర స్వామిశివాలయం దగ్గర జరిగిన అన్న సమారాధన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులులో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు
