సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్ధానం మరియు భీమవరంలో 1200 ఏళ్ళ చరిత్ర ఉన్న పురాతన శ్రీ ఉమా భీమేశ్వర స్వామి వారి దేవస్ధానం, నందు ఈనెల 24 నుండి జరగబోవు వార్షక మహా శివరాత్రి కళ్యాణ మహోత్సవముల సందర్భముగా నేటి బుధవారం సాయంత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్ధానం నందు ఇవో లతో రెవెన్యూడివినల్ అధికారి, భీమవరం మునిసిపల్,పోలీస్ శాఖతో, వివిధ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించటమైనది. ఈ సమావేశం నందు వివిధ శాఖల అధికార్లు పాల్గొని వేడుకల నేపథ్యంలో ఈ నెల 26, 27, 28 తేదీలలో మహాశివరాత్రి, రధోత్సవాలు, తెప్పోత్సవాలు నేపథ్యంలో వేలాదిగా తరలివచ్చే భక్తులకు చెయ్యవలసిన ఏర్పాట్లు ట్రఫిక్ నియంత్రణ లపై సమీక్షా నిర్వహించారు.
