సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చివరి కార్తీక సోమవారం సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు భీమవరంలోని పలు శివాలయాలను దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆయన ముందుగా పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీసోమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు దేవస్థానధర్మకర్తలు, చైర్మన్ చింతల పాటి బంగారు రాజు, ఆలయ ప్రధాన అర్చకులు చేకూరి రామకృష్ణ పూర్ణకుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలోకారుమూరి సత్యనారాయణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి రాయలంలోని శ్రీబాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, లక్షపత్రి పూజ, రుద్రాక్షలతో పూజ నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మెంటే పార్ధ సారధి లు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *