సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సుంకరపద్దయ్య వీధిలోని అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద గత మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ భజన వైభవంగా నిర్వహించారు. చోడిపల్లి నూకరాజు, నళిని దంపతులచే పూజ కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు 25 అడుగుల అందమైన ప్రత్యేక మండపంలో అయ్యప్ప స్వామికి అలంకరణ చేసి పడిపూజ భజన నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, మాజీ మునిసిపల్ వైస్ చైర్మెన్ గనిరెడ్డి త్రినాథ్ లు పడిపూజ భజన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక మండపంలో అయ్యప్పస్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 1000 మంది అయ్యప్పస్వామి, భవాని మాలధారణ, మావుళ్ళమ్మ మాలధారణ భక్తులు భజనలో పాల్గొన్నారు. స్థానిక కూటమి నేతలు కారుమూరి సత్యనారాయణ మూర్తి,లంకి శ్రీనివాస్, ముచ్చకర్ల శివ, ముచ్చకర్ల సుబ్బరావు, అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *