సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరంలో వాడవాడలా చలువ పందిళ్ళలో,శ్రీ విష్ణు దేవాలయలవద్ద శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి ముహూర్త ప్రకారం శ్రీ సీతారామ కళ్యాణాలు పండితుల వేదమంత్రాలతో నిర్వహించడం, చలివిడి వడపప్పు పానకాలు, అన్నసమారాధన లతో పట్టణం అంతటా ఆధ్యాత్మిక శోభ తో కళకళ లాడుతుంది. రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు నేటి ఉదయం నుండి శ్రీ రామ నవమి సందర్బంగా భీమవరంలోని రైతు బజార్ రోడ్, నాచువారి సెంటర్, రామాయణం సుబ్బన్న గారి తోట, గునుపూడి స్థూపం సెంటర్ ప్రాంతాల్లో జరిగిన శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని ప్రజలందరికీ అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసాద వితరణలలో పాల్గొంటున్నారు.
