సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జై.. శ్రీరామ్.. భీమవరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఆదివారం కూడా కావడంతో భక్తులు కుటుంబసమేతంగా శ్రీ విష్ణు, శ్రీరామ ఆలయాలకు తరలి వచ్చారు.భీమవరం లో వాడవాడలా పలు శ్రీ సీతారామస్వామి ఆలయాలలో , షిర్ది సాయి బాబా వారి ఆలయాలలో ఘనంగా శ్రీ స్వామివారి కల్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గునుపూడి సోమేశ్వర్ ఆలయం వద్ద, శ్రీ భేమేశ్వర ఆలయం వద్ద, కేశవరావు హైస్కూల్ వద్ద, శ్రీ కోదండ రామాలయంలో, పెదమిరం షిర్డీ స్వర్ణ సాయి మందిరంలో, మినీ షిర్డీ లోను , మోటుపల్లి వారి వీధిలో ,ఎడ్వార్డ్ ట్యాంక్ చెరువు వద్ద, జెపి రోడ్డు లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఆలయాలలో,చినమీరం రామాలయాలలో, హౌసింగ్ బోర్డు కాలని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించి భక్తులకు పానకం తో పాటు పలుచోట్ల శ్రీరామ సంకీర్తనలు, ప్రవచనాలు, అన్నసమారాధన, వడపప్పు, పానకం మిఠాయిలు, ప్రసాద వితరణలు భారీగా నిర్వహించారు. అయితే నిర్వహణ ఖర్చులు పెరగటంవల్ల కావచ్చు.. భీమవరంలో ప్రధాన రోడ్ల వెంబడి గతంలోలా పలు సంఘాల వారు చలువ పందిళ్లు వేసి జరిపే వేడుకల సందడి మాత్రం తగ్గింది.
