సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, ఆదివారం పట్టణంలో 5 రోజులు పాటు వినాయక చవితి సంబరాలు చేసిన పందిళ్ళలో, ఇండ్లలో పూజలు పూర్తీ చేసిన వినాయకుల విగ్రహాల నిమజ్జనం కోలాహలం నెలకొంది. స్థానిక పంట కాలువలు లో యువతరం సందడిగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే స్థానిక పోలీస్ నిబంధలు ప్రకారం డీజే సౌండ్ లు నిషేధించడం తో స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు తక్కువ సౌండ్ తో డీజేలుతో యువత కోలాహలంగా పండుగ జరుపుకోవచ్చునని ఆయన కార్యాలయం నుండి ప్రకటించారు. ఇదిలా ఉండగా పట్టణంలో 5 రోజులు పండుగ పూర్తీ చేసిన పలు శ్రీ వినాయక పందిళ్ళలో జరిగిన అన్న సమారాధన లలో స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు, సత్యవాణి దంపతులు పాల్గొని భక్తులకు భోజన ప్రసాద వడ్డన కార్యక్రమాలు ప్రారంభించారు. భీమవరం 26వ వార్డు రెడ్డి కాలనీలో శ్రీసిద్ది గణపతి ఆలయ చతుర్ధి వార్షికోత్సవం లో ఎమ్మెల్యే అంజిబాబుమాట్లాడుతూ.. నాలుగేళ్లుగా సాంప్రదాయ బద్దంగా చవితి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అలాగే భీమవరం 23వ వార్డులో వినాయక చవితి 21వ వార్షికోత్సవంలో భాగంగా పవర్ స్టార్ యూత్ అధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నదానం ఇతర దానాల కంటే గొప్పదిగా భావిస్తారని అన్నారు. కార్యక్రమ;లలో స్థానిక యూత్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *