సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ వ్యాప్తంగా నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భీమవరం పట్టణంలో పురాతన శ్రీ భీమేశ్వర స్వామి గుడిలోని రాధా కృష్ణ గుడిలోను,పెదమిరంలోని స్వర్ణ సాయి మందిరం వద్ద ఇంకా అనేక వైష్ణవ దేవాలయాలలో వేడుకల ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటి సాయంత్రం ఉట్టి కొట్టే వేడుకను కూడా పలు విధులలో నిర్వహిస్తున్నారు. అయితే భీమవరం సమీపంలోని గొల్లలకోడేరు లో 30 కోట్లా రూపాయలు ఖర్చుతో ఇస్కాన్ నిర్మాణం పూర్తీ కావస్తున్నా సుందర భవనంలో వేడుకలు నేడు, శనివారం రేపటి ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. , నేడు, తెల్లవాఱుజామునుండి కృష్ణాష్టమి నేపథ్యంలో వేడుకలు కోలాహలం , కార్యక్రమాలు కోలాటాలు , కచేరీలు అంబరాన్ని అంటాయి. పలువురు విదేశీ కృష్ణ భక్తులు హాజరు కావడం అదనపు ఆకర్షణగా నిలచింది. చిన్నారులతో శ్రీ కృష్ణ రూప అలంకరణలు నేటి సాయంత్రం హైలైట్గా నిలవనున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు వచ్చే వేలాది భక్తులకు అద్భుతమైన మహా ప్రసాద వితరణ చేస్తున్నారు. ఇస్కాన్ మందిరం విద్యుద్దీప కాంతుల నడుమ బృందావనాన్ని తలపిస్తుంది.
