సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జేపీ రోడ్ లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాసం ప్రారంభం నేపథ్యంలో నేటి సోమవారం ఉదయం 6 గంటల నుండి శ్రీవారికి ప్రత్యక పూజలు నిర్వహించారు.ధనుర్మాసం నేపథ్యంలో ప్రతి రోజు ఎన్నో ఆధాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. గత రాత్రి పౌర్ణమి నేపథ్యంలో నిండు చంద్రుని వెలుగులతో దేవాలయంలో శ్రీవారు దేవేరులతో కలసి గరుడ వాహనంపై భక్తుల గోవిందా గోవిందా నామాల మధ్య నక్షత హారతులు , ఫలాలు అందుకొంటూ అందుకొంటూ దేవాలయం చుట్టూ 7 సార్లు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ( ఫై చిత్రంలో)
