సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి పొందిన 33 రోజుల పాటు జరిగే భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి వార్షికోత్సవాలు వచ్చే జనవరి నెల 14 వ తేదీ నుండి ప్రారంభమౌతున్న నేపథ్యంలో నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాల కోసం ఇప్పటికే శరవేగంగా ఆలయం మూడువైపులా భారీఎత్తున తాటాకు చలువ పందిళ్లు ఏర్పాట్లు పూర్తీ కావస్తుంది. (ఫై చిత్రంలో దృశ్యం). ఆ ప్రాంతం నుండి వెళ్లే వాహనదారులకు పచ్చి తాటాకు వాసనలు చక్కగా ఆస్వాదించవచ్చు. ఇక భారీ సెటింగ్స్, లైటింగ్స్, పందిరి అలంకరణలు కూడా ఉత్సవాలు నాటికీ పూర్తీ చేస్తారు. అన్ని చోట్ల సంక్రాంతి 3రోజులు ఉంటె భీమవరం లో మాత్రం బంగారు తల్లి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి కృప తో సంక్రాంతి కళను 33 రోజులు సందడిగా కొనసాగనుంది.
