సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మండల ధీక్షా మాలాధారణం నేపథ్యంలో నేడు, ఆదివారం తెల్లవారు జామున గం 4.35 ని.లకు సుమారు 160 మంది అమ్మవారి భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ద్వారా ఎర్రటి దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేయించిన తదుపరి అమ్మవారి దీక్షా ధారణ చేయించడం జరిగింది. ఈకార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహనదికారి యర్రంశెట్టి భద్రాజీ, చైర్మన్ మానేపల్లి నాగేశ్వరావు ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ ముత్యాల వెంకట రామారావు, మావూరి సుందర రావు , శేషాగిరి, తాళ్లపూడి భాగ్యలక్ష్మి, గోపిశెట్టి విజయ లక్ష్మి , కోయ వెంకట లక్ష్మి , నీలాపు విజయ నాగ లక్ష్మి తదిరులు పాల్గొన్నారు.
