సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని స్థానిక ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం లో (త్యాగరాజ భవనం) ,శనివారం శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ యోగిని చంద్రకాళి ప్రసాద మాతాజీ వారి ఆధ్వర్యంలో విశేషంగా శ్రీ వాసవి మాత అమ్మవారికి వందలాది ఆర్యవైశ్య దంపతులు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. తదుపరి మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమంలో ప్రసాద వితరణ జరిగింది.పట్టణంలోని వ్యాపారస్తులు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. సాయంత్రం 6 గంటల నుండి మరల ఆధ్యాత్మిక సందడి నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *