సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం ఆవరణలో పందిళ్లు, లైటింగ్ అలంకరణలో కళా వేదికపై నిర్వహిస్తున్న శ్రీ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి రోజు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషముగా నిర్వహిస్తున్నారు. గత రాత్రి యువతులల్తో కలసి చిన్నారులు నిర్వహించిన శాస్త్రీయ సంగీత వేడుక ఆహుతులను అలరించింది. శ్రీ అమ్మవారితో పాటు శ్రీ వినాయకుని అస్సిసుల కోసం భక్తులు విశేషంగా హాజరు అవుతున్నారు. పట్టణంలో నిన్నఆదివారం మేళ తాళాలు , వినాయక ప్రతిమల నగర ఊరేగింపు లతో బాణసంచా కాల్పులు మధ్య, సాయంత్రం నుండి రాత్రి వరకు ఉండి రోడ్డు పంటకాలువ, విస్సాకోడేరు వంతెనల వద్ద నిమజ్జనాల వేడుకలు, పోలీస్ భద్రతా మధ్య ఘనంగా జరిగాయి. ఈ రోజు పలు పలు పందిళ్ళ లో భక్తులకు మహా అన్నప్రసాద వితరణలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల నవరాత్రుల , 11 రోజులు వేడుకలు కొనసాగుతున్నాయి. భీమవరం 2 టౌన్ లో ఒక్క దుర్గాపురం , బివి రాజు మార్గ్ మినహా ఏ కారణం చేతనో శ్రీ వినాయక పందిళ్ళ సందడి బాగా తగ్గింది.
