సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో ప్రముఖ శివాలయాలు శ్రీ సోమేశ్వర దేవాలయం, శ్రీ భీమేశ్వర దేవాలయంలలో శ్రీ స్వామివార్ల తెప్పోత్సవాలు నేడు, సోమవారం రాత్రి 7-30 గంటలకు స్థానిక గునుపూడిలోని చంద్ర పుష్కరిణి, మరియు బివి రాజు, వీరమ్మ పార్క్ కొలను లో దీపావళి ని తలపించే భారీ బాణాసంచా కాల్పుల మధ్య దివ్యంగా అలంకరించిన పడవలపై శ్రీ పరమేశ్వర, పార్వతి అమ్మవార్ల తో పండితుల వేదమంత్రోచ్ఛరణల తో ఘనంగా తెప్పోత్సవాలను రాత్రి 9. 45వరకు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను చూడటానికి భీమవరం పరిసర ప్రాంతల నుండి సుమారు 25వేలమంది భక్తులు, చిన్నారులు తరలి వచ్చి ఉత్సవ వేడుకలలో పాల్గొని, తిరునాళ్ల తీర్ధంలో సందడి చేసారు. పంచారామ తెప్పోత్సవ వేడుకలను ధర్మ కర్తల మండలి సభ్యులు, చైర్మెన్ కోడె విజయలక్ష్మి, మరియు దేవాలయ ఇఓ ఎం అరుణ్ కుమార్ పర్యవేక్షించారు. చంద్రపుష్కరిణి కి అన్ని వైపులా అందమైన లైటింగ్ సెట్టింగ్స్ , శ్రీ ఆదిలక్ష్మి గుడి వారు ఏర్పాటు చేసిన లైటింగ్ తో కలపి మంచి ఆకర్షణగా మారింది. ఈ తెప్పోత్సవ భక్తులు హాజరు కాగా దేవాలయ సిబ్బందితో పాటు, స్థానిక వన్ టౌన్ పట్టాన సీఐ ఆధ్వర్యంలో భారీ పోలీస్ భద్రతా మధ్య తెప్పోత్సవాని ఆహ్లాదంగా నిర్వహించారు. రేపు మంగళవారం ఉదయం చంద్ర పుష్కరిణి లో అర్చక స్వాములు నిర్వహించే వసంతోత్సవంతో మహాశివరాత్రి మహోత్సవాలు పరిపూర్ణం కానున్నాయి
