సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సంక్రాంతి పేరు చెబితే తెలుగు రాష్ట్రాలలో అందరికి గుర్తువచ్చేది భీమవరం.. శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి నెల రోజులు పైగా జరిగే ఉత్సవాలతో పాటు , ఇక్కడ అతిధులకు ఆతిధ్యాలు, మరీముఖ్యంగా పండగ 4 రోజులలో కోట్ల రూపాయల చేతులు మారే కోడిపందాలు అంటే చాల మంది జూదరాయుళ్లకు మక్కువ.. అయితే గత 2ఏళ్ళు కరోనా ప్రభావం, జనం దగ్గర డబ్బు తగ్గడం తో పాటు పోలీస్ ఆంక్షలు తో పందాలు తీవ్రత కొంత తగ్గినప్పటికీ, ఈసారి సంప్రదాయం పేరుతొ భీమవరం పరిసర ప్రాంతాలలో భారీ బరులలో కోడిపందాలు ఏస్థాయిలో జరుగుతాయన్నది నిర్వాహకులు సస్పెన్సు మెయింటైన్ చేస్తున్నారు. పరిసర గ్రామాలలో భారీ తిరునాళ్లను తలపించే జూదాలు తగ్గించి సాంప్రదాయ కోడిపందాలు కు మాత్రం తగ్గేదే లే.. అన్నది కొందరి నిర్వాహకుల తీరు .. చూడాలి. ప్రస్తుతానికి పోలీస్ నిఘా ఉంది. ఇక్కడికి చాల సమీపంలో ఉన్న కోనసీమ లో మాత్రం ఇప్పటికే బరులకు ఏర్పాట్లు శరవేగంగా.. వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి జిల్లాలో కోడి పందేలు, బెట్టింగుల నివారణకు జిల్లావ్యాప్తంగా కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తాజగా ప్రకటించారు,. పక్షులు, జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం–1960, ఆంధ్ర ప్రదేశ్‌ గేమింగ్‌ చట్టం–1974కు విరుద్ధంగా ఎవరైనా కోడి పందేలు, బెట్టింగ్‌ నిర్వహించిన ఎడల శిక్షార్హులవుతారని హెచ్చరించారు. కంట్రోల్‌ రూమ్‌ల ఫోన్‌ నెంబర్లు కలెక్ట రేట్‌: 08812–224519, టోల్‌ ఫ్రీ నెంబరు 1800–233–1077, వాట్సాప్‌ నెంబర్లు: 91540 39159, 70329 14877, ఎస్పీ కార్యాలయం : 08812–230100, లకు ఫోన్‌ చేసి వీటిపై సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *