సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఇటీవల సంక్రాంతి కి వస్తున్నాం.. వచ్చిన సినిమా తో సంక్రాంతి మొనగాడు గా వెంకీ మామ ‘F2’ తరువాత ( 2019 సంక్రాంతికి అప్పుడు వెంకీ’ ఎఫ్ 2, రామచరణ్ వినయవిధేయ రామ, బాలయ్య కధానాయకుడు సినిమాలు పోటీ కావడం యాదృచ్చికం)మరోసారి నిరూపించుకొన్నాడు. సంక్రాంతి కి వస్తున్నాం’ సినిమాకు కేవలం 7 రోజులకు 1కోటి 14 లక్షలు రూపాయలు కలెక్షన్ వసూళ్లు అయ్యాయి.మొదటిరోజు బెనిఫిట్ షో లు లేకుండా సుమారు 7 థియేటర్స్ లో 7 రోజులకు 173 షో లు ప్రదర్శించగా 138 షో లు హౌస్ ఫుల్ కావడం రికార్డు గా చెప్పుకోవాలి. ఇక నేటి బుధవారం వరకు 9 రోజులలో సుమారు 1 కోటి 30 లక్షలు కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. ఇక సంక్రాంతి కి రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 400 కోట్ల భారీ సినిమా గేమ్ చెంజర్ బెనిఫిట్ షో కలెక్షన్ తో కలపి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ 12 రోజులలో 86 లక్షలు వసూళ్లు సాధించగా, ‘మాస్ దేవుడు’ బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ కేవలం 10 రోజులకు 75 లక్షలు వసూళ్లు సాధించి వరుసగా 4వ సూపర్ హిట్ ను ఆయన ఖాతాలో జామా చేసింది. మొత్తానికి వెంకిమామ, బాలయ్య, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు 60 ప్లస్ లో కూడా పాన్ ఇండియా సినిమా కాకుండానే ఇలా వందల కోట్ల కలెక్షన్స్ తో అగ్రహీరోలుగా తమ సత్తా చూపిస్తుంటే.. యువ హీరోలు కు పోటీ మరింత పెరిగి తెలుగు సినిమా సత్తా కు ప్రపంచం నివ్వెరపోతుంది
