సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నేడు, మంగళవారం స్థానిక పంక్షన్ హాలులో జరిగిన వాలంటీర్లు కు ప్రభుత్వ అవార్డ్స్ వేడుకలలో భీమవరం పట్టణంలో పలు వార్డులలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవ మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర వంటి పలు అవార్డులకు ఎంపికైన పలు వార్డు వాలంటర్లకు మునిసిపల్ కమిషనర్ , మునిసిపల్ అధికారులు మరియు స్థానిక వైసిపి నేతల ఆధ్వర్యంలో ఘన సన్మానాలు చేసి వారికీ ప్రభుత్వ ప్రశంస పత్రాలు, బహుమతి రొక్కలు అందజేసి వారి సేవలను ప్రశంసించారు. ఈ అవార్డులు రాకపోయిన ప్రతి వాలంటీర్ కూడా తన ప్రాంత పరిధిలో అందిస్తున్నవిశేష సేవలతో స్థానికుల మన్నలను పొందుతున్నారని, ఇంటింటికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమాన్ని చేరుస్తున్నారని వారికీ ప్రభుత్వం నుండి గౌరవవేతనాలు స్వలంగా వస్తున్నపటికి ప్రజల నుండి ప్రత్యక గౌరవం ఉందని వక్తలు కొనియాడారు. ఈ సమావేశానికి విశేషంగా వాలంటీర్లు మరియు వారి సన్నిహితులు హాజరు అయ్యి సందడి చేసారు.
