సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా మండల న్యాయ సేవా సంస్ధ ఆధ్వర్యంలో గురువారం భీమవరం 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ . N.జ్యోతి భీమవరం లోని స్ధానిక ప్రత్యేక ఉపకారాగారాన్ని సందర్శించి ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెయిల్ మంజూరై చాలా కాలం నుండి జైలులోనే ఉండిపోయిన ముద్దాయిలు జామీను కోర్టుకు సమర్పిస్తే విడుదలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పరిసరాలను, వంట గదిని పరిశీలించి ముద్దాయిల కోసం వండిన పదార్ధాలను రుచి చూసారు. సిబ్బందికి కొన్ని సూచనలు చేసిన తదుపరి ఆమె మాట్లాడుతూ.. నేరం రుజువు కానంత వరకూ న్యాయమూర్తులు ముద్దాయిలను అనుమానితులుగా పరిగణిస్తారు, నేరం రుజువైనప్పుడు మాత్రమే దోషులుగా, శిక్షార్హులుగా భావిస్తారు, కారాగారంలో వున్న ముద్దాయిలు సత్ప్రవర్తన కలిగి, దైవ చింతనతో గడపాలి, వక్ర ఆలోచనలకు దూరంగా వుండాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ D.వెంకటగిరి, జైలు ఉచిత సలహా న్యాయవాది లోకేష్, ఉచిత న్యాయవాదులు సుధీర్, అంబేద్కర్, కంచర్ల వెంకట రమణ, సూర్యనారాయణ, సానా నాగబాబు, సంతోష్, ఉమారాణి, తోట శ్రీలక్ష్మి, పారా లీగల్ వాలంటీర్లు సత్యనారాయణ రాజు, చాన్ బాష, నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *