సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘బాహుబలి’ సినిమాల సిరీస్ ఘనవిజయాలు తరువాత ఆ స్థాయి విజయం ప్రభాస్ ఎప్పుడు కొడతాడా? అని సుదీర్ఘంగా ఎదురుచూసిన భీమవరం బ్రాండ్.. ప్రభాస్ అభిమానుల కోరిక తీర్చే సలార్ గా పాన్ ఇండియా సూపర్ స్టార్ చెలరేగిపోయాడు.. ప్రపంచ వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుండి ప్రదర్శనలు మొదలు కావడంతో ఉదయానికల్లా సినిమాకు సూపర్ టాక్ వచ్చింది.. ఇక కలెక్షన్స్ రికార్డు ఆట మొదలయింది. అయితే ప్రభాస్ సినిమా అంటే ప్రపంచం అంతా ఒక ఎత్తు.. భీమవరం ఒకటే ఒక ఎత్తు.. భీమవరంపట్టణంలో నిన్నటి నుండే సంబరాలు ప్రారంభం అయ్యాయి. బాణాసంచా కాల్పులతో గత రాత్రి అంబరాన్ని అంటాయి. ఇక్కడ రోడ్లపై ప్రధాన సెంటర్స్ తో పాటు కిలో మీటర్లు మేర ప్లెక్సీ లు , 50 నుండి 100 అడుగుల భారీ ప్లెక్సీ లు , అపార్ట్మెంట్స్ ఫై సైతం ‘ప్రభాస్ అంటే మేడ్ ఇన్ భీమవరం బ్రాండ్’ అంటూస్వాగతం పలుకుతున్నాయి. అన్నసమారాధనలు, వస్త్ర దానాలు, రక్త దానాలు అర్ధరాత్రి వరకు యువత భారీ బైకు ర్యాలీ లు హడావిడి తో పాటు బాణాసంచా కాల్పులతో గత రాత్రి ఆనందాలు అంబరాన్ని అంటాయి. ఆ సంబరాల ఖర్చుతో ఒక సినిమా తీసెయ్యచ్చు.. వర్షం.. సినిమా నుండి ప్రతి ప్రభాస్ కొత్త సినిమా మొదటిఆట భీమవరంలో పడిపోతుంది. టాక్ తెల్లవారేసరికి బయటకు వచ్చేస్తుంది. అయితే దురదృష్టం ఏమిటంటే .. ఈ సారి బెనిఫిట్ షో ప్రదర్శనలు ఫై టికెట్స్ భారీ రేట్లకు విక్రయించకూడదని ప్రభాస్ అభిమానులనే ఒక వర్గం వ్యతిరేకించి అధికారులకు పిర్యాదు చెయ్యడంతో .. అధికారులు థియేటర్స్ కు ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం 40 రూపాయల అదనపు రుసుము తోనే టికెట్స్ అమ్మాలని కఠిన ఆదేశాలు జారీ చేసారు. ఈ గందరగోళంలో .. అర్ధరాత్రి నుండి ప్రారంభం కావలసిన సలార్ ప్రదర్శనలు నేటి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కావడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ ఎదురయ్యింది. లేకపోతె తెల్లవారే సరికి మొత్తం 11 థియేటర్స్ కలపి సుమారు 22 ఆటలు పూర్తీ అయ్యి 30 లక్షల పైగా కలెక్షన్స్ కూడా వసూలు అయ్యేది.
