సిగ్మాతెలుగు తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శివారు లోని చినఅమిరం గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబడిన SRKR ఇంజినీరింగ్ కళాశాల ఫౌండర్ కీ.శే, సాగి రామకృష్ణంరాజు 90వ జయంతి వేడుకల సందర్భంగా నేడు, బుధవారం కాలజి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ .. గతంలో ఎంతో కష్టతరమైన ఇంజినీరింగ్ విద్యని సుమారు 5దశాబ్దాల క్రిందటే ఈప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన గొప్ప వ్యక్తి అని, సాగి రామకృష్ణంరాజు కృషి తోనే ఇంకా ఉన్నతంగా ఆధునిక విద్యాప్రమాణాలతో కొనసాగుతుందని కొనియాడారు. తదుపరి కళాశాల యాజమాన్యం అందించిన చిరు సత్కారాన్ని స్వీకరించారు, అనంతరం విలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *