సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా భీమవరం పట్టణంలో నేడు, శనివారం ఉదయం స్థానిక ASR నగర్ పార్కు, వాటర్ ట్యాంక్ సమీపాన భీమవరం పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ మరియు మున్సిపల్ ఇంజనీర్ వారి ఆధ్వర్యంలో సింగల్ యుజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు మరియు నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువుల వాడకం పై ప్రత్యేక అవగాహనా కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు, సదరు కార్యక్రమానికి సమీప వార్డుల సచివాలయ సిబ్బంది, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ వారు,అన్ని డివిజన్ల శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ మేస్త్రులు మరియు మెప్మా సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహ కల్పించడం జరిగినది.
