సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో నేడు, సోమవారంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ వర్క్స్ మరియు పట్టణ సుందరీకరణ పనులను పలు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పర్యవేక్షించారు. స్థానిక మోక్షధామం, జెపి రోడ్డులోని అభిరుచి కెనాల్ రోడ్, శ్రీ రామాపురం ,హన్సి కళ్యాణమండపం రోడ్, కామాక్షి గుడి రోడ్ నియర్ ఫ్లై ఓవర్ , 3 టౌన్ లోని ఇండస్ట్రియల్ ఏరియా రోడ్, ప్రక్రుతి ఆశ్రమం వైపు కల్లెక్టరేట్ రోడ్ తదితర పనులను జిల్లా కలెక్టర్ అధికారులతో కలసి సమీక్షించారు. భీమవరం పురపాలక సంఘ అధికారులకు అన్ని వర్క్స్ కు సంబంధించి మంచి నాణ్యత తో శరవేగంగా పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి భీమవరం ప్రత్యేక అధికారి హోదాలో ఆదేశాలను జారి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు మునిసిపల్ కమీషనర్ ఎస్ శివ రామకృష్ణ , మునిసిపల్ ఇంజినీర్ పి. త్రినాథ రావు, Dy EE టి. నారాయణ రావు, Dy EE కె. రాజరావు, TPO సీతారామయ్య, AE’s మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
