సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనేడు బుధవారం భీమవరం నియోజకవర్గంలోని 31 మంది లబ్ధిదారులకు రూ 21,17,909 చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు వారికి అందించారు. ఆపదలో ఉన్న వారికి పేదవారికి అభయ హస్తం సీఎం సహాయ నిధి అని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో 18 విడతలుగా 282 మందికి రూ 2,57,18,877 లను అందించామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
