సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో స్థానిక కేశవరావు హైస్కూల్ గ్రౌండ్ లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జనవరి 2, 3, 4 తేదీల్లో ప్రతిష్టాకరంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేసారు. చక్కగా ఎత్తు చేసిన గ్రౌండ్ లో వేదిక కూడా సిద్ధం చెయ్యడం తో పాటు ఆ పరిసర ప్రాంతాలు అన్ని ఎర్రజెండలతో రెపరెపలాడుతున్నాయి. ఈ సభలకు జిల్లా సిపిఎం కీలక నేతలు బలరాం, JV గోపాలన్ తో పాటు ఎమ్మె ల్సీ షేక్ సాబ్జీ నేతృత్వం వహిస్తున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. 26 జిల్లాల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు.సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి డి.ఎన్.వి.డి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలం బిస్తున్న విశాఖ ఉక్కు తదితర కార్మిక వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చిస్తారన్నారు.
