సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గాములో వాడవాడలా పలువార్డులలో జరుగుతున్నా ‘జగనన్న సురక్ష ‘ సభల్లో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విశేషముగా హాజరయి తన చేతుల మీదుగా స్థానికులకు , మహిళలకు విద్యార్థులకు అవసరమైన రేషన్ కార్డ్స్, రెవెన్యూ సర్టిఫికెట్, తదితర పత్రాలను అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికైనా అన్ని అర్హతలు ఉండి ఎదో చిన్న లోటు తో ప్రజా సంక్షేమ పధకాలు అందుకోలేకపోతే వాటిని కూడా సరిదిద్ది వాటిని లబ్దిదారులకు అందించే ఏర్పాట్లు అధికారుల సహకారంతో చేస్తున్నారు. గత శనివారం,వీరవాసరం మండలం లోని వీరవాసరం, రాయకుదురు, భీమవరంలోని ఏడవ వార్డు, 19 వార్డు సచివాలయాల వద్ద జరిగిన జగనన్న సురక్ష సభలలో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా సురక్ష కు మంచి ఆదరణ వస్తుందని ..జగన్ సర్కార్ ఇస్తున్న సంక్షేమాలను , పింఛను లను అవినీతికి తావులేకుండా ప్రజలు ఇంటికే చేరుస్తుంటే ..ఒర్వేలేక కడుపు మంటతో వాలంటీర్ల వ్యవస్థ పై ప్రక్క రాష్టంలో నివాసం ఉండి ఇక్కడ రాజకీయాలు చేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వ్యాఖ్యలు దారుణమని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు.అధికారులతో పాటు వలంటీర్ల సహకారం తోనే, దేశంలో ఎక్కడ లేని విధంగా కరోనా వంటి మహమ్మారిని ఎదిరించామన్నారు. నిరుద్యోగ యువతి యువకులకు వాలంటీర్లుగా ఒక క్రమ శిక్షణ అలవడింది అని, గడపగడపకు ప్రభుత్వ పాలన రాజకీయాలకు అతీతంగా వలంటీర్ల వల్లే సాధ్యమైందని .. అయితే మగవాళ్ళు లేనప్పుడు ఇంటి తలుపులు తడుతున్నారని వలంటీర్లను చంద్రబాబు కించపరిచారని ,పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వాలంటీర్ల వ్యవస్థ ను , మహిళా వాలంటీర్లను మన ఇంట్లో ఆడువారు ఉన్నారు అన్న విజ్ఞత లేకుండా అవమానించాడని వారికీ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *