సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం సూపర్ స్టార్ కృష్ణ జన్మ దినం నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అశేషంగా ఉన్న పద్మభూషణ్ ,హీరో స్వర్గీయ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి పేదలకు వస్త్రదానం అన్నదానం చేస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో భీమవరం ఎడ్వార్డ్ ట్యాంక్ వద్ద ఉన్న సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహానికి సీనియర్ అభిమానులు ,నాలుగు దశాబ్దాలపాటు కృష్ణతో అనుబంధం ఉన్నరాయప్రోలు శ్రీనివాస్ మూర్తి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి ,తదితరులు మాట్లాడుతూ వెండితెరపై సూపర్ స్టార్ కృష్ణ పేరు చేరగని ముద్ర అని, తెలుగు సినిమా అధునాత పంధాలో ప్రపంచ స్థాయి కి వెళ్ళడానికి ఆయన చేసిన ప్రయోగాలు సాహసాలు మూలకారణం అని..అంతకు మించి తరతరాలు నిలిచే మానవత్వానికి మంచి తనానినికి కృష్ణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని అన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, సభ్యులు భట్టిప్రోలు శ్రీనివాసరావు కృష్ణ ఫ్యాన్స్ అసోసియషన్ గౌరవాధ్యక్షులు రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ ..నాలుగు దశాబ్దాలపాటు కృష్ణతో అనుబంధం ఉందని, ప్రతి అభిమాని గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారని, ఆయన పేరిట ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలను చేపడతామని అన్నారు. అనంతరం పేదలకు భోజనం, గొడుగులనుఅందించారు. కార్యక్రమంలో కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు సుబ్బరాజు, పేరిచర్ల లక్ష్మణ వర్మ, పెన్నాడ శ్రీను, కాట్రెడ్డి సత్యనారాయణ, గంట ప్రసాద్, ఎస్ లక్ష్మీ నారాయణ, తాతపూడి రాంబాబు, ఎల్ మహేష్, చిన్నమని ప్రసన్న, కొండ రాజాధిరాజు, భాష, రాకేష్ తదితర అభిమానులు పాల్గొన్నారు.
