సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, శుక్రవారం డిఆర్డిఏ ఆధ్వర్యంలో విస్సాకోడేరు వంతెన డౌన్ లో ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తుల అంగడిని డిప్యూటీ స్పీకర్ , రఘురామ కృష్ణంరాజు అన్నారు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు. అంగడి అంతా పరిశీలించి సేంద్రియ ఉత్పత్తులను నగదు చెల్లించి కొనుగోలు చేశారు. రైతులతో, డ్వాక్రా మహిళలతో మాట్లాడి ఎక్కడ పండిస్తున్నారు? ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతున్నారా? సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ ఎలా ఉంది, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రఘురామ మాట్లాడుతూ.. సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల అంగడి సాంప్రదాయబద్ధంగా మంచి వాతావరణం లో ఏర్పాటు చేయడం, ఎస్ హెచ్ జిల ద్వారా నిర్వహించడం ఒక శుభ పరిణామన్నారు. పెద అమిరంలో కూడా సేంద్రీయ ఉత్పత్తుల అంగడి ప్రారంభించడానికి స్టోర్ తయారవుతుందని, రానున్న 10 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. అంజిబాబు మాట్లాడుతూ .. సేంద్రియ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, పురుగు మందులు వాడని కూరగాయలను ఉపయోగించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, లైవ్లీ హుడ్స్ డిపిఎం కుసుమ కుమారి, పాలకోడేరు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *