సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం బివిరాజు మార్గ్ రోడ్డులోని, రెడ్డి మారుతి షోరూమ్ ఏరియాలో స్థానికులు చెప్పిన వివరాలు ప్రకారం.. నేటి సోమవారం ఉదయం 8. 15 నిమిషాల సమయంలో దుర్గాపురం నుండి సెంటీమీరీస్ స్కూల్ పిల్లలతో వెళుతున్న ఆటో డివైడర్ ను వేగంగా ఢీ కొనడం తో ఆటో తిరగబడి డ్రైవర్ కు పిల్లలకు గాయాలు అవ్వడంతో వారిని స్థానికులు వెంటనే అటువైపు గా వెళుతున్న వాహనాన్ని ఆపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది, ( కొద్దీ సేపటికి వేగంగా 108 కూడా వచ్చింది)డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయినట్లు భావిస్తున్నారు, ఆటోలో రక్తపు మరకలు, పిల్లల ఏడుపులు గాయాలు తో ఆటో అద్దాలు పగిలి పుస్తకాలు , పెన్నులు వాటర్ బాటిల్స్ చెల్లాచెదురు గా రోడ్డు ఫై పడిఉండటం తో ఆ ప్రాంతం భయానకంగా ఉంది, ఆటో డ్రైవర్ డివైడర్ వద్ద యూ టర్న్ కొడుతుండగా బైకు అటువైపు రావడంతో ఆటోను కంట్రోల్ చేయ్యలేకపోవంతో అది తిరగబడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు, పోలీసులు వచ్చి దర్యాప్తు ప్రారంభించాక పూర్తీ వివరాలు వెలుగులోకి వస్తాయి, ఆసుపత్రిలో అందరు క్షేమముగా బయట పడాలని కోరుకొందాం..
