సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు గత శుక్రవారం సాయంత్రం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో “స్త్రీ శక్తి” కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. BJP రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ.. కొందరు ఆటో యూనియన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ఇది సరైనది కాదని, ఈ పథకం వలన ఆటో చోదకులకు ఏ విధమైన నష్టం జరగదని, ప్రభుత్వం కూడా వీరి గురించి ఒక ఆలోచన చేస్తుందన్నారు. ఎన్నికల హామీలల్లో భాగంగానే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. స్త్రీ శక్తి మహిళలకు శక్తిని పెంచి కర్తవ్య బాధ్యతగా పని చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తారన్నారు.గ్రామీణ మహిళలు, కళాశాలలకు వెళ్లే బాలికలు, వయసులో ఉన్న మహిళలకు ఈ పథకం ప్రయోజనంగా ఉంటుందన్నారు. పిఎసి చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 3 వేల పెన్షన్ నాలుగు వేలకు, దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు , రైతు భరోసా కింద రూ 7 వేలు, తల్లికి వందనం పేరిట రూ 13 వేలు అందజేయడంతో పాటు, నేడు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్ పర్సన్ పీతల సుజాత, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *