సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నిర్మాణంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు మరోసారి స్వాదించారు. నేడు, ఆదివారం జేపీ రోడ్ రహదారిపై నిలబడి భీమవరం పట్టాన స్వాగతం బోర్డు ఎంట్రన్స్ పక్కన నిలబడి , పెద అమిరంలోని తాను కలెక్టర్ కు సూచించిన స్థలాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేలు పెట్టి చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భీమవరం పట్టానికి ప్రధాన రహదారిని అనుకోని అతి సులువుగా జిల్లా ప్రజలు చేరుకునేలా కలెక్టరేట్ ను తాను మరియు ప్రభుత్వ సహకారంతో నిర్మించి ఇస్తానని అంటే భీమవరం వైసీపీ వాళ్ళు ఆందోళనకు పిలుపు నిస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో హడావిడి చేస్తున్నారని ప్రజలు గమనించాలి అని పిలుపు నిచ్చారు.రెండు లక్షల నలభై వేల ఎస్ఎఫ్‌టీతో అన్ని ఆఫీసులు ఉండేలా ఇప్పటికే ప్లాన్ సైతం తాను ప్రభుత్వానికి సమర్పించానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అన్ని నియోజకవర్గాలకు ఈ స్థలం ఉత్తమంగా ఉందని ప్రతిపాదనలు ఇచ్చామని అన్నారు. వైసీపీ వాళ్ళు కావాలంటే ఇప్పటికి రాజధాని రుషికొండలోనే ఉండాలి..ముఖ్యమంత్రి అందులోనే ఉండాలని ఆందోళన చేసుకొండంటూ సెటైర్ వేశారు. అసలు విషయానికి వస్తే భీమవరం కు చెందిన వైసీపీ మాత్రం భీమవరంలో స్థలం లేదని జిల్లా పార్టీ ఆఫీసు ఉండి నియోజకవర్గ పరిధిలో కట్టారా? అని ప్రశ్నించారు రఘురామా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *