సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుంకర పద్దయ్య గారి వీధిలో గత నేటి సోమవారం తెల్లవారు జామున సుమారు 1:00 AM నుండి 3:00 AM మధ్య జరిగిన దారుణమైన జంట హత్యల (డబుల్ మర్డర్) ఘటనకు సంబంధించి, జిల్లా ఎస్పీ, అద్నాన్ నయీం అస్మి, ఈ రోజు ఉదయం, (నవంబర్ 10, 2025 )ఉదయం, సంఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ నేరం జరిగిన భయానకంగా ఉన్నఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించడంలో భాగంగా, క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ అధికారులతో కలిసి ముఖ్యమైన కీలక ఆధారాలను సేకరించారు. ఈ దారుణ ఘటనలో, స్థానికుడు గునుపూడి శ్రీనివాస్ (37) తన తల్లి గునుపూడి మహాలక్ష్మి (60), మరియు తమ్ముడు గునుపూడి రవితేజ (33) లను కుటుంబ సమస్యల కారణంగా హత్య చేసినట్లు స్వయంగా ఫోన్ చేసి వెల్లడించాడని, అంతేకాక నిందితుడి మానసిక స్థితి సరిగా లేనట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని ఎస్పీ తెలిపారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, పారదర్శకంగా దర్యాప్తు చేయాలని, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట భీమవరం డీఎస్పీ ఆర్. జయసూర్య , జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ , మరియు భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం. నాగరాజు ఉన్నారు.
