సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విద్యార్థులలో, బాల బాలికల్లో సృజనాత్మకత పెంపొందించడానికి బాలోత్సవం దోహదం పడుతుందని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు బాలోత్సవాలలో భాగంగా నేడు,ఆదివారం భీమవరం సిహెచ్ బిఆర్ఎం హైస్కూల్లో నిర్వహించిన అడవి బాపిరాజు స్మారకోన్నత చిత్రలేఖనం పోటీలను ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా భీమవరంకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ స్థాయిలో పేరొందిన చిత్రకారుడు ,న్యాయవాది, అధ్యాపకుడు, నటుడు రచయిత, బహుముఖ ప్రజ్ఞావంతుడు అడవి బాపిరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ,, బాలల మానసిక వికాసానికి అలాగే విద్యాభ్యాసం ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కళలు అవకాశం కల్పిస్తాయన్నారు. అడవి బాపిరాజు మనుమరాలు కాళ్ళకూరు పద్మను కలెక్టర్ సత్కరించారు. ప్రముఖ సినీ హీరో అడవి శేషు కూడా ఈయన మనవడు కావడం విశేషం..ముందుగా రాయలం పాఠశాలకు చెందిన డ్రాయింగ్ టీచర్ రాజేంద్ర ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ను కలెక్టర్ సందర్శించి ఆనందం వ్యక్తం చేసి డ్రాయింగ్ టీచర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్టీవో కె.శ్రీనివాసులు రాజు , తహసీల్దార్ y. రవికుమార్ వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతెన కృష్ణంరాజు ,కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్ రాజు, చెరుకువాడ రంగసాయి, మానవతాసంస్థ ప్రతినిధులు సాగి జానకి రామరాజు, బుద్ధరాజు వెంకటపతి రాజు , బాలోత్సవం కమిటీ ప్రతినిధులు పి. సీతారామరాజు, బి చైతన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *