సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ మాజీ చైర్మన్ నాచు వెంకట్రామయ్య 29వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కార్యాలయం, మరియు నాచు వారి సెంటర్ లోని వారి విగ్రహాల వద్ద విగ్రహ కమిటీ, కుటుంబ సభ్యులు, అభిమానులు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేను రాజు, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, టీడీపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, మాట్లాడుతూ నిస్వార్థ ప్రజా సేవకులు రాజకీయ దురంధరులు రైతు బంధువులు వెంకట్రామయ్య అని, నాచు వెంకట్రామయ్య ఒక వ్యక్తి కాదని, ఒక మహా సంస్థ అని, ఏ పదవి చేపట్టిన పదవికి న్యాయం చేసిన వ్యక్తి అని, రెండుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మున్సిపల్ ఛైర్మన్ గా భీమవరం పట్టణంకు విశేష సేవలు అందించారని అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయానికి స్థలం చేకూర్చారని అన్నారు. నాచు వారి సెంటర్ లో విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు రంగసాయి, కాగిత వీర మహంకాళి రావు, నల్లం వీర స్వామి, గ్రంధి వెంకట్రావు, చెనమల్ల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు ఎండి నౌషాద్, విజ్జురోతి రాఘవులు, ఎస్ కృష్ణమోహన్, నాచు వారి కుటుంబ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *