సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాసం వద్ద ఆయన తండ్రి స్వర్గీయ సూర్యనారాయణ రాజు ప్రధమ వర్ధంతి ని పితృ కర్మలతో ఘనంగా నిర్వహించారు. తదుపరి కే యస్ రాజు పంక్షన్ హాలులో వర్ధంతి సభ , భోజనాలు ఏర్పాటు చేసారు. ఈనేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రజా ప్రతినిధులు , బీజేపీ తో పాటు రాజకీయాలకు అతీతంగా పార్టీ ప్రముఖులు, స్థానిక ప్రజలు హాజరు అయ్యి స్వర్గీయ సూర్యనారాయణ రాజు గారికి ఘన నివాళ్లు అర్పించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కు సంఘీభావం ప్రకటించారు. మిత్రులు శ్రీనివాస్ వర్మ కు సిగ్మా న్యూస్ కూడా నేడు పరామర్శించడం జరిగింది. (ఫై ఫోటో లో .. పరామర్శింస్తున్న జిల్లా ఎమ్మెల్యే అంజిబాబు తో పాటు ఎస్పీ అద్నాన్ నయీమ్ ని చూడవచ్చు..)
