సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: స్వర్గీయ YS రాజశేఖర్ రెడ్డి గారి 13 వ వర్ధంతి సందర్భంగా భీమవరం స్థానిక గునిపూడి లో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజుYSR విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. YSR తో కలసి పనిచేసిన ఘటనలు తనకు గర్వకారణంగా నిలుస్తాయని, ప్రజా సంక్షేమం కోసం ఎంత సాహసోపేత నిర్ణయం అయిన తీసుకొనే స్వర్గీయ వై ఎస్ ను ఆదర్శంగా తీసుకొని వారి కుమారుడు సీఎం శ్రీ YS జగన్మోహన్ రెడ్డి కూడా పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
