సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భారత దేశ 77 వ స్వతంత్ర దినోత్స వ వేడుకల సందర్భంగా భీమవరం పట్టణం అంతటా ఎక్కడ చుసిన మూడు రంగుల జెండాల రెపరెపలాతో చిన్నారుల కేరింతలు తో శోభాయమానంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన వేడుకలలో తనయుడు రవితేజతో కల్సి వెళ్లి పాల్గొని స్థానికులకు శుభాభినందనలు తెలుపుతున్నారు. ముందుగా ఆయన కార్యాలయం వద్ద కులమతాలకు అతీతంగా వైసిపి నేతలతో కలసి గాంధీ ఫోటో కు పుష్పాలు వేసి మూడు రంగుల జెండా ఎగురవేసి జాతి గౌరవానికి సెల్యూట్ కొట్టారు. మిఠాయిలు పంపిణి చేసారు. మన దేశ స్వాతంత్రం సాధించడానికి సుమారు 200 ఏళ్లు పైగా ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలు గడ్డి పోచలా భావించి పోరాడితే మన తరాలు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నాయని ఇది అందరు గుర్తుపెట్టుకొని దురాశ లను దూరంగా పెట్టి మానవ సమాజ అభివృద్ధికి కృషి చెయ్యాలని పిలుపు నిచ్చారు. తదుపరి అయన స్థానిక ఎంఆర్ ఓ ,కార్యాలయం, మునిసిపల్ కార్యాలయం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లలో ఇంకా అనేక చోట్లా విరామం లేకుండా స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
