సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా భీమవరంలో గత రాత్రి 9 థియేటర్స్ లో ప్రీమియర్ షో లతో రిలీజ్ అయ్యింది. స్థానిక పద్మాలయ , మల్టి ఫ్లెక్స్ వద్ద అభిమానులు సంబరాలు చేసారు. మల్టి ఫ్లెక్స్ లో అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు అభిమానులతో కలసి సినిమా వీక్షించారు.గత రాత్రి ప్రీమియర్ షో టికెట్ రేట్లు ఏకంగా క్లాస్ 700 రూపాయలు క్రింద సీట్లు టికెట్స్ 500 రూపాయలు దాటినా అభిమానులు ఏ మాత్రం తగ్గలేదు. తదుపరి నేటి గురువారం తెల్లవారు జాము 1గంటకు 5 థియేటర్స్ లోను తదుపరి ఉదయం 6 గంటలకు 4 థియేటర్స్ లోను నేడు, ప్రస్తుతం 8 థియేటర్స్ లో షో లు ప్రదర్శిస్తున్నారు. టికెట్ రేట్లు అధికంగా ఉండటంతో నిన్న ప్రీమియర్ షో లలోనే సుమారు 20 లక్షల పైగా కలెక్షన్ దాటేసినట్లు తెలుస్తుంది. ఇక నేడు ప్రదర్శించే షో లకు టికెట్స్ ధరలు 300 రూపాయలు ఫై మాటే.. సినిమా టాక్ డివైడ్ గా వచ్చిన మొత్తంగా నిన్న, నేడు కలపి 50 లక్షల కలెక్షన్ సాధించే అవకాశం కనపడుతుంది.
