సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ కే రామచంద్ర రెడ్డి ఒక ప్రకటనలో.. భీమవరం పట్టణ పరిధి లో గల అన్ని హోటల్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు, స్వీట్ షాప్స్ మరియు బేకరీ యాజమానులకు తెలియచేయునది ఏమనగా గత కొంత కాలం గా పురపాలక సంఘ అధికారులు నిర్వహించిన తనిఖీలలో పలు హోటల్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల్ వారు కనీస నాణ్యాత ప్రమాణాలు మరియు పరిశుభ్రత పాటించకుండా రోజులు కొద్ది నిలువ చేసిన ఆహార పదార్థాలు మరియు ఆహార పదార్దాలు ఆకర్షణీయం గా కనిపించేందుకు కొన్ని నిషేధించిన రసాయన రంగులను ఉపయోగిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. సదరు విషయంపై వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా గతంలో అందరికి నోటిసులు జారీ చేయడం జరిగింది కావున ఇక పై భీమవరం పట్టణ పరిధి లో ఏదైనా భోజన హోటళ్ళు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ షాప్స్, బేకరీ మరియు ఇతర అన్ని రకాల ఆహార తయారీదారులు సరైన ప్రమాణాలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన లేదా కుళ్ళిపోయిన ఆహారాన్ని విక్రయించినా, నిషేదిత రసాయన రంగులు వంటలలో ఉపయోగించినా మరియు వంట తయారీశాల లందు లేదా విక్రయ ప్రాంతాలలో పరిశుభ్రత పాటించకపోయినా వారిపై పురపాలక చట్టం 1965, ప్రజా ఆరోగ్య చట్టం 1939 మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 నందలి నిబంధనలను అనుసరించి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించుట తో పాటు గా వారి యొక్క ట్రేడ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసి వారి వ్యాపారాన్ని మూసివేయడం జరుగుతుంది అని హెచ్చరికలు జారీ చేయడమైనది.
