సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: క్రమశిక్షణ విధేయత ఏకాగ్రత కలిగి ఉంటే విద్యార్థులు జీవిత గమనంలో ప్రతిభ వంతులుగా విద్యావేత్తలుగా గుర్తింపబడతారని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ,స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నేడు, మంగళవారం ఈ విద్యా సంవత్సరం 10 th , ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన 64 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, 9 కళాశాలల 124 మంది విద్యార్థులకు ఎంపీ , ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రతిభ పురస్కారాలను అందించారు. రాజ్యసభ సభ్యులు, పాక సత్యనారాయణ మాట్లాడుతూ మా తండ్రి నరసింహమూర్తి ఆరోజుల్లో చదువుకోలేక పోవడంతో నన్ను BA, BLవిద్యకు ప్రోత్సహించి చదివించారని, ప్రస్తుత తరుణంలో విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదన్నారు. ఈ కార్యక్రమంలో రంగసాయి, ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి, గన్నాబత్తుల శ్రీనివాస్, వబిలిశెట్టి రామకృష్ణ, గంధం శ్రీదేవి, అరసవల్లి సుబ్రమణ్యం, కారుమురి సత్యనారాయణ మూర్తి, విజ్జురోతి రాఘవులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
