సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అన్ని రంగాలలో అబివృద్ధి చెందిందంటే రాజకీయాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు బాగోగుల కోసం ప్రజా ప్రతినిధులు చేసిన నిరంతర కృషి అని మరువకూడదు. దీనిలో 2019 నుండి 2024 వరకు ఎమ్మెల్యేగా 2వ పర్యాయం పనిచేసిన గ్రంధి శ్రీనివాస్ గత ఎన్నికలలో ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయన హయాంలో ఈ ప్రాంతంలో ప్రజల ఆరోగ్య అవసరాల కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం భీమవరం పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ జిల్లా ప్రజలకు కూడా అందుబాటులోకి రావాలన్న విశాల దృక్పధంతో అప్పటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు గొల్లవానితిప్ప రోడ్డులో విరాళంగా ఇచ్చిన కోట్ల రూపాయలు విలువ చేసే 4 ఎకరాల స్థలంలో 2023 జనవరిలో గ్రంధి వెంకటరత్నం, వెంకటేశ్వరరావుల పేరుతొ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఏరియా హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం అయింది. దీనికి అప్పటి సర్కార్ మొదటగా 50 పడకల ఏరియా హాస్పిటల్ గా 10కోట్ల 15 లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కృషితో 50 పడకలకి బదులుగా ఆధునిక నిర్మాణాలతో ఏకంగా 100 పడకల ఆసుపత్రి కోసం నాబార్డ్ నుండి మరో రూ 28 కోట్ల నిధులు మంజూరైనట్లు 2023 నవంబర్ 7న ప్రకటించారు. అంటే మొత్తం 38 కోట్ల 15 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. దానితో 2 అంతస్తులల్తో విశాలమైన కొత్త భవనాల నిర్మాణాల పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరో 15 నెలలు వ్యవధిలో నిర్మాణం పూర్తీ చెయ్యాలని లక్యంతో పనులు పరుగులు పెట్టించారు. అయితే 2024 జూన్ 5న ఎన్నికల ఫలితాలలో గ్రంధి శ్రీనివాస్ పరాజయం పొందటంతో 3వ సారీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు హయాంలో ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుంది. దీనికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి ‘భూపతిరాజు శ్రీనివాస వర్మ’ కూడా మరిన్ని ఆధునిక వైద్య హంగులు, కిడ్నీ రోగులకు డయాలసిస్ అవసరాల కోసం ‘రాష్ట్ర ఆరోగ్య సఖ మంత్రి’ సత్య కుమార్ కు రికమండ్ చెయ్యడం దానికి ఆయన కూడా అంగీకరించడంతో కోస్తా ఆంధ్ర లో ఒక అత్యాధునిక ప్రభుత్వ హాస్పటల్ ప్రజలకు వైద్య సేవలు అందించడానికి త్వరలో అందుబాటులోకి రానుంది. ( up file photo)
