సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సిపిఐ పార్టీ 100 వసంతాల పండుగను పురస్కరించుకుని భీమవరంలో నేడు, గురువారం ప్రజా ప్రదర్శన భారి బహిరంగ సభ నిర్వహించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వేచ్చా, స్వతంతంత్రాలు కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఘన చరిత్ర సిపిఐ కే దక్కిందని పార్టీ ఆవిర్భావం మొదలు నేటి వరకు అంటరానితనం, సమాన హక్కులు, సమసమాజం నిర్మాణం, మత సామరస్యం కోసం సిపిఐ అవిశ్రాంతంగా పోరాడింది అని భీమవరంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ.. రష్యా విప్లవం స్పూర్తితో 1925 డిసెంబరు 26న కాన్పూరులో సిపిఐ ఆవిర్భవించిందని సంపూర్ణ స్వాతంత్రం లక్ష్యంగా ఉద్యమించిందనని, వేలాది మంది కమ్యూనిస్టులు జైళ్లు పాలయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మందికి పైగా అసువులు బాశారని, పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన భూ పోరాటం పద్దెనిమిది మంది చనిపోతున్నారని వారందరి స్పూర్తితో ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సీతారాంప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, అగ్రిగోల్డ్ ఏజెంట్స్ కస్టమర్స్ అసోసియేషన్ నాయకులు కె.గోపాలకృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వె.వి.ఆనంద్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు, మామిడిశెట్టి లక్ష్మిపతి, ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు కోడెల యామిని, తదితరులు పాల్గొన్నారు.
