సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో గునుపూడి ప్రాంతంలో రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు పుట్టిన రోజు వేడుకలు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భారీ వేదికపై ఘనంగా నిర్వహించారు. అలాగే కొయ్యే మోషేనురాజు తన జన్మదిన కానుకగా స్థానిక సెంటర్ లో స్వయంగా ఏర్పాటు చేసిన 1000 కేజీల కాంస్యంతో డాక్టర్ అంబెడ్కర్ భారీ విగ్రహాన్ని ఘనంగా ప్రారంభించారు. భారత రాజ్యాంగాన్ని నిర్ధేశ్యం చేసిన ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కారించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, నేను ఈ స్థాయికి రావడానికి సీఎం జగన్ తో పాటు సహకరించిన అందరికి కృతజ్ఞలు తెలుపుతున్నానని మండలి చైర్మెన్ మోషేను రాజు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, వైసీపీ జిల్లా మహిళా అడ్జక్షురాలు, గూడూరి ఉమాబాల, తదితర కీలక నేతలు పాల్గొన్నారు. స్వయం కృషితో రాష్ట్రంలోనే గౌరవ స్థాయి పదవి కి ఎదిగిన మోషేను రాజు ప్రజలకు మరింత సేవ భావంతో ఒదిగి పనిచేస్తున్నారని, ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని శుభాబినందలు తెలిపారు. గునుపూడి ప్రాంతం అంతటా భారీ పోలీస్ బందోబస్తు తో విఐపిల రాకతో యువకుల సందడితో ఫ్లెక్సీలతో, డేకేషన్స్ తో సందడిగా ఉంది. ఆహూతులందరికి భారీ విందు ఏర్పాటు చెయ్యడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *