సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో 43 మంది దాతల సహకారంతో పట్టణంలోని ప్రతిభావంతులైన 111 మంది విద్యార్థులకు రూ 10 లక్షల 98 వేల ఉపకార వేతనాలను, వెదురునగరం స్కూల్ కు రూ 50 వేలు మొత్తం రూ 11 లక్షల 48 వేలు ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. నాకు చదవంటే ఎంతో ఇష్టమని, నేను చదువుకోలేదు.. తరువాత తరం ఖచ్చితంగా చదువుకోవాలనే తపన పడే వ్యక్తి ను నేను అని అన్నారు. ప్రతిభవంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని, ప్రతిభకు పేదరికం అడ్డుకాదన్నారు. ఆర్డీవో ప్రవీణ్ కుమార్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ప్రతి ఏడాది మెరిట్ స్కాలర్ షాప్ లు అందించడం అద్వితీయమన్నారు. ప్రతి విద్యార్థి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం ఒక ఎంఎంబిఎస్, ఒక బిడిఎస్, ఒక సీఏ, ఒక ఎం టెక్, ఇద్దరు బి ఫార్మసి, ఇద్దరు ఎంసిఏ, ఒక ఏంబిఏ, 80 మంది బి టెక్, 4 గురు డిప్లొమా, 12 గురు డిగ్రీ, 6 గురు ఐటిఐ విద్యార్థులకు మొత్తం 111 మంది విద్యార్థులకు రూ 10 లక్షల 98 వేలు అందించారు. కార్యక్రమంలో శ్రీఅల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
