సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ​కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రేపు ఆదివారం భీమవరం, ఆచంటలో రెండు కీలకమైన డయాలసిస్ కేంద్రాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న డయాలసిస్ రోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఇందుకోసం సుమారు ₹10 కోట్ల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. ​భీమవరం ఏరియా హాస్పిటల్ వద్ద ₹2 కోట్ల CSR నిధులతో 8 అత్యాధునిక డయాలసిస్ యంత్రాలతో కూడిన 8 బెడ్ల డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి, అదేవిధంగా, ఆచంటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) వద్ద ₹1 కోటి వ్యయంతో 3 డయాలసిస్ యంత్రాలు, 3 ప్రత్యేక బెడ్లతో కూడిన సెంటర్‌ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్విస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజా ఆరోగ్య సంరక్షణలో మరో కీలక అడుగుగా సుమారు ₹4 కోట్ల వ్యయంతో ఒక అత్యాధునిక క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ యూనిట్ వ్యాన్‌ను జిల్లా వాసుల ఆరోగ్య పరిరక్షణ కోసం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *