సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో రెండో పట్టణ పోలీస్ అధికారులతో సమావేశం అయ్యారు. రెండో పట్టణ సీఐ కృష్ణ కుమార్, ఎస్ఐలు రాంబాబు, అప్పారావులతో ఆయన మాట్లాడుతూ.. రెండవ పట్టణంలో శాంతిభద్రతల విషయంలో పోలీసు అధికారులు చిత్త శుద్ధితో విధులను నిర్వర్తించాలని , ఇటీవల కాలంలో రెండవ పట్టణంలో రాత్రిళ్ళు ఇంట్లో దొంగలు చొరబడి డబ్బు బంగారం దోచుకొనిపోయిన కేసులలో ఏ మేర దొంగలను పట్టుకొని , బాధితులకు ఏ మేర రికవరీ చేస్తున్నారో? రాత్రిళ్ళు పెట్రోలింగ్ ఎలా చేస్తున్నారు. తదితర విషయాలు అడిగి తెలుసుకొన్నారు. శాఖాపరంగా శాంతి భద్రతలను రక్షించడంలో పోలీసు అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని ఆదేశించారు .అదే మాదిరిగా ట్రాఫిక్ సమస్య ను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తదుపరి ఆయన డ్రైనేజీ శాఖ అధికారులతో సమీక్షా జరిపారు. నియోజకవర్గ పరిధిలో వరి సాగుకు ఆటంకం లేకుండా నియోజకవర్గంలో మేజర్, మీడియం డ్రై న్లను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంట కాలువలు, డ్రై న్ల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షాలు ఎక్కువగా కురిసిన నేపథ్యంలో పంట చేలల్లో ముంపు నీరు నిలవ లేకుండా ఎప్పటికప్పుడు బయటకు తోడేందుకు వీలుగా డ్రై న్ లను ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో డి ఈ సుబ్రహ్మణ్యేశ్వర రావు, జేఈ దుర్గారావు లు పాల్గొన్నారు
