సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపదలో ఉన్నవారికి అభయ హస్తంలా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, బుధవారం సాయంత్రం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ 20 మంది లబ్ధిదారులకు రూ 21,31,462 చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఇప్పటికి వరకు భీమవరం నియోజకవర్గంలో 20 విడతలో 321 మందికి రూ 2,90,48,358 లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
