సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, శనివారం నూతన సంవత్సర వేడుకలు జిల్లాలో ఎక్కడ లేనివిధంగా అత్యంత కోలాహలంగా జరిగాయి. గత శుక్రవారం సాయంత్రం నుండి బేకరీలలో, రెస్టారెంట్స్ లలో కేకులు, స్వీట్స్, బిర్యానీల పార్సిల్ అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. విచిత్రం ఏమిటంటే ఈసారి ఎక్కడ తగ్గేదేలేదంటూ.. గతంతో పోలిస్తే పోటాపోటీ ధరలు పెంచి అమ్మడం విశేషం..బ్రాండెడ్ తో సహా అన్ని మద్యం ధరలు దిగిరావడంతో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. మందుబాబులు కు ఓవర్ డోస్ అయ్యింది.ఇక పూలు పండ్లు కూడా భారీ అమ్మకాలు నేటి మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీస్ వారి హెచ్చరికలు, బహిరంగ వేడుకలు నిషేధం నేపథ్యంలో అదనపు పోలీసులను మోహరించినప్పటికీ పట్టణంలో గత రాత్రి యువత లో బైకు బాబుల, మందుబాబుల దూకుడు,కనిపించింది. చిన్నపాటి ఘర్షణలు ను పోలీసులు నివారించారు..కొందరు అర్ధరాత్రి బాణాసంచా కాల్పులు సంబరాలు చేసారు. ఈసారి దేవాలయాలు అర్ధరాత్రి తెరుచుకోనప్పటికీ కొందరు దేవాలయాలను బయట నుండి దర్శించుకొని తృపి పడ్డారు. మొత్తం మీద పోలీసులు చాల సమన్వయంతో పరిస్థితిని అదుపులోనే ఉంచారని చెప్పాలి. గత రాత్రి నుండి పలుచోట్ల క్రిస్మస్ వారోత్సవాలు ఘనంగా ముగింపు పలికారు. నేటి ఉదయం నుండి శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం, పంచా రామంలో భక్తుల సందోహం భారీగా పెరిగింది. స్థానిక ఇక జిల్లా కు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థాయి నేతలు భీమవరంలో ఉండటంతో స్థానిక పార్టీల అభిమానులతో పాటు జిల్లా నుండి పలువురు నేతలు పట్టణంలో ప్రవేశించడం తో అదో అదనపు సందడి..
