సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో నూతన ఏడాది ప్రారంభ సందర్భముగా నేడు, సోమవారం ఉదయం నుండి అన్ని ప్రముఖ దేవాలయాలలో ఈ ఏడాది తమకుటుంబాలకు శుభప్రదం కావాలని కోరుకుంటూ భక్తుల రద్దీ పెరిగింది. అలాగే స్థానిక రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఇంటా ఎప్పటిలానే కోలాహలం కనపడింది. అయితే స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం ఎప్పటిలానే సందడిలో ప్రత్యేకత చాటుకొంది. ఇక జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షులు కోటికల పూడి గోవిందరావు ( చినబాబు) కార్యాలయంలో గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఆయనకు శుభాభినందనలు తెలిపారు. మరో 3 నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు జనసేన పార్టీ ప్రముఖులు ఎక్కువ సంఖ్యలో ఆయనకు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు. ఇక మాజీ ఎమెల్య పులపర్తి అంజిబాబు, మెంటే పార్ధసారధి నేతల ఇంటా కూడా టీడీపీ నేతల సందడి ఎక్కువగా కనపడింది. ఇక రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు విజయవాడలో ఉండటంతో, టీడీపీ జిల్లా అడ్జక్షురాలు తోట సీతారామ లక్ష్మి హైదరాబాద్ వెళ్లటంతో వారి ఇంటికి వచ్చిన అభిమానులు కొంత నిరాశ చెందారు.
