సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎక్కడో అమెజాన్ అడవులలో కాదు.. భీమవరంలో తాజాగా నేడు, సోమవారం ఉదయం యనమదుర్రు కాలువ నుండి పంటచేలకు నీరు వదులుతుండగా అదే నీటి గుంట నుండి సుమారు 21అడుగుల ఓ భారీ కొండచిలువ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.. ఆ కొండచిలువ ను చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున రావడంతో అది కాలువ నీటి గుంట లోపలికి వెళ్ళిపోయింది. ఆ భారీ పొడవున్న బలమైన కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురిఅయ్యారు. ఇది ఈ ప్రాంతానిది కాకపోవచ్చునని ఎక్కడి నుండో కాలువలో కొట్టుకొనివచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
